
Parama Sujnanulaku
పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు మరుగురుని మీదట మనసుండవలదా ఆకలిగొన్నవానికి అన్నముపై నుండినట్టు యేకట వుండవలదా యీశ్వరునిపై కాకల విటులచూపు కాంతలపై నుండినట్టు తేకువ నుండవలదా దేవునిమీదటను పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు కొసరే భక్తివలదా గోవిందునిపై వెసదెరువరి తమి విడిదలపై నునట్టు వసియించ వలదా శ్రీవల్లభుమీదను వెప్పున ధనవంతుడు నిధి కాచియుందినట్టు తప్పక శ్రీవేంకటేశు తగులవద్దా అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు యిప్పుడే వుండవలదా యీతని మీదనూ parama suj~nAnulaku prapannulaku maruguruni mIdaTa manasuMDavaladA AkaligonnavAniki annamupai nuMDinaTTu yEkaTa vuMDavaladA yISwarunipai kAkala viTulachUpu kAMtalapai nuMDinaTTu tEkuva nuMDavaladA dEvunimIdaTanu pasibiDDalaku nAsa pAlachaMTipai nunnaTlu kosarE bhaktivaladA gOviMdunipai vesaderuvari tami viDidalapai nunaTTu vasiyiMcha valadA SrIvallabhumIdanu veppuna dhanavaMtuDu nidhi kAchiyuMdinaTTu tappaka SrIvEMkaTESu tagulavaddA appasamaina bhrama AlajAlAlakunnaTTu yippuDE vuMDavaladA yItani mIdanU
Chapters
Parma Sujnanulaku | 4:40 |